విశాఖపట్నం :జులై 29 (మీడియావిజన్ ఏపీటీఎస్)
ఆయుర్వేద పంచకర్మ విధానం ద్వారా దీర్ఘకాల రోగాలకు చికిత్స అందించేందుకు ఆగస్టు 3 నుంచి 6 వరకు కేరళ ఆయుర్వేద శిబిరం నిర్వహిస్తున్నట్టు వైద్యరాజ్ ఔషధాలయ మేనేజర్ దినుప్ తెలిపారు. ప్రముఖ కేరళ వైద్యులు డాక్టర్ కే యం ఉన్నికృష్ణన్ నాయర్ 4 రోజుల పాటు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. డాక్టర్ ను సంప్రదించాలనుకే వారు అపాయింట్మెంట్ కొరకు 7675861446 లేదా ల్యాండ్ లైన్ లో 0891-2568264 నెంబర్ లో సంప్రదించవచ్చునన్నారు. చర్మ వ్యాధులు, ఆర్థ్రరైటిస్, సైనసైటిస్, పోరియాసిస్, వత్తిడి, ఈ ఎన్ టి సమస్యలు, హైపర్ టెన్షన్ (ఆందోళన) , ఆర్థరైటీస్ (కీళ్ళ వ్యాధులు ), నడుం నొప్పి, స్పాండిలైటిస్, మానసిక వత్తిడి, నిద్రలేమి, రుమాటిజం వంటి సమస్యలతో బాధపడే వారికి ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్ నాయర్ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మురళి నగర్ శ్రీదేవి పార్క్ సమీపంలో గల తమ కేంద్రంలో నేరుగా వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.