విజయవాడ ఆగస్టు 13: మీడియావిజన్ ఏపీటీఎస్, స్టేట్ బ్యూరో
ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు, రిపోర్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని సమాచార శాఖ డైరెక్టర్ శుక్లా ఐఏఎస్ అన్నారు. మంగళవారం విజయవాడ లోని సమాచార శాఖ కమీషనర్ కార్యాలయం లో పలువురు చిన్న పత్రికల ఎడిటర్లు కమీషనర్ ను కలిశారు ఈ సందర్భం గా వారు అక్రిడిటేషన్స్ , చిన్న, మధ్యరహా దిన, వార, పక్ష, మాస పత్రికలకు రిగ్యులర్ గా ప్రకటనలు, క్రొత్తగా ఎంప్యానెల్మెంట్,కోసం నోటిఫికేషన్ విడుదల, ఇప్పటికే వెరిఫికేషన్ జరిగి పెండింగ్ లో ఉన్న పత్రికల ఎంపానల్మెంట్ పై తగిన చర్యలు, తీసుకోవాలని , 2019 నుండి ఉన్న చిన్న పత్రికల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, కోరారు, స్పందించిన డైరెక్టర్ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతమన్నారు, రెగ్యులర్ గా వస్తున్న పేపర్లు, మ్యాగజైన్ లకు తప్పని సరిగా న్యాయం జరుగుతుందన్నారు. అవసరమైతే మరలా త్వరలో జర్నలిస్ట్ యూనియన్స్, ఎడిటర్ల అసోసియేషన్స్తో సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. డైరెక్టర్ ను కలిసిన వారిలో పలువురు పాత్రికేయ సంఘాల నాయకులు, ఎడిటర్లు ఉన్నారు .వల్లూరు ప్రసాద్ కుమార్,(అంతిమతీర్పు,),ఎన్ కోటేశ్వరరావు(కామన్ మాన్ వాయిస్),డి నాగరాజు(పల్లె క్రాంతి)ఆర్ కోటేశ్వరరావు(వార్తా ప్రభ ),జి శివ నారాయణ(అమరావతి అపురూప)సురేష్(మల్లెల వార్త )కే విలియం జన్సాన్(ఆంధ్ర వాలా)జి హరి ప్రసాద్(ధరణి )ఈ పి పి కుమార్(భారత శక్తి) ,సురేష్(అనంత భూమి