Blog

ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు…జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు

-సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు వినతులు

-ఇంటికళ, పెన్షన్ పధకం సాకారం చేయాలని విజ్ఞప్తి

-వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ పెందుర్తి యూనిట్ నూతన కార్యవర్గం

ఎన్ఏడి, ఆగష్టు 14(మీడియావిజన్ ఏపీటీఎస్)

రాష్ర్టంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు బుధవారం బాజీ జంక్షన్ ఆర్ ఆర్ గ్రాండ్ లో నిర్వహించిన ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల పెందుర్తి యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని అయితే ఆ ప్రక్రియ వేర్వేరు కారణాలుతో ముందుకు సాగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకుండా ఆఖరి నిమిషంలో ప్రతీ జర్నలిస్టుకు మూడుసెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించిన తరువాత పట్టించుకోలేదన్నారు. ఏళ్ల తరబడి జర్నలిస్టుల ఇంటి కల నెరవేరకపోవడం విచారకరమన్నారు. అలాగే అక్రిడేషన్లు, అటాక్స్ కమిటీలు పునరుద్దరించడంతో పాటు అన్ని సంఘాలకు ఆయా కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తాము కోరుతున్నామన్నారు. ఆయా విషయాలను తమ రాష్ర్ట కార్యవర్గం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నివేదించనున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. ఇప్పటికే ఆయా నేతల అపాయింట్ మెంట్లు తాము కోరడం జరిగిందన్నారు. ఏపివర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాసరావు లు మాట్లాడుతూ విశాఖ పరిధిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అలాగే పెండింగ్ సమస్యలను గుర్తించి తక్షణమే వాటిని పరిష్కరించేందుకు తమ పరిధి మేరకు ప్రయత్నిస్తామన్నారు. అన్ని పండుగల నిర్వహణతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. పెందుర్తి యూనిట్ నూతన కార్య వర్గం ను గంట్ల శ్రీను బాబు తదితరులు సత్కరించారు.రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో బ్రాడ్ కాస్ట్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, ఫెడరేషన్ జిల్లా నాయకులు ఏ. సాంబ శివరావు, కోనేటి సత్తి బాబు,పుచ్చల భాస్కర్ కోశాధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు

ఏపీడబ్ల్యుజేఎఫ్ పెందుర్తి , యూనిట్ నూతన కార్యవర్గం నియామకం

ఏపీడబ్ల్యుజేఎఫ్ పెందుర్తి , యూనిట్ నూతన కార్యవర్గం నియామకం జరిగింది. అధ్యక్షులుగా కోనాల సంజీవన్(సంజీవ్), ప్రధాన కార్యదర్శి చింతల గణపతి రావు, కోశాధికారి సవితిని వెంకట్ సూర్య, ఉపాఅధ్యక్షులు చింతాడ వెంకటరమణ, బొడ్డేటి ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు గా గంటా ప్రసాద్, బుచ్చిబాబు, సుధాకర్ లీగల్ అడ్వైజర్ న్యాయవాది వాండ్రంగి విశ్వేశ్వరరావు, ఈసీ మెంబర్లుగా చక్రి అన్వేష్, ఈశ్వరరావు, సాయి కృష్ణ శ్రీను, నియమించారు. నూతనంగా నియమితులైన పెందుర్తి యూనిట్ కార్యవర్గ సభ్యులను గంట శ్రీనుబాబు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విటెల్ రాము, అంబటి శేషు పసుపులేటి నర్సింగరావు గండ్రెడ్డి లక్ష్మణరావు, ఎన్ఏడి గోపాలపట్నం వేపగుంట పెందుర్తి సింహాచలం జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button