మానవత్వాన్ని మరిచి వైద్యురాలిపై కర్కశంగా వ్యవహరించి, హత్యచేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలి…………. ఆరిలోవ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్య బృందం,సిబ్బంది డిమాండ్
విశాఖపట్నం ఆగస్టు 25: మీడియావిజన్ ఏపీటీఎస్ బ్యూరో
కోల్కత్తా లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్య ను ఖండిస్తూ ఆరిలోవ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్య బృందం,సిబ్బంది శనివారం ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మానవత్వాన్ని మరిచి వైద్యురాలిఫై కర్కశంగా వ్యవహరించిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. ఆరిలోవ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలోజరిగిన ఈకార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కృషి చేయాలని అందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. చిన్నపిల్లల నుండి పండు ముసలి వారిని కూడా వదలని కామాంధులకు కఠినమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ వెంకటేశ్వరులు వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.