- ఈనెల 21వ తేదీ సాయంత్రం నుంచి సాగర తీరంలో అభిమానుల పండుగ
- హాజరవుతున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు
విశాఖపట్నం : ఆగస్టు 20 (మీడియావిజన్ ఏపీటీఎస్ సాంసృతిక విభాగం )
ప్రముఖ సంఘసేవకుడు,సినీ నిర్మాత, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఉపకార ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు సౌజన్యంతో చిరంజీవి యువత విశాఖ జిల్లా ఆధ్వరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన సాయంత్రం నుంచి సాగర తీరంలో నిర్వహించే వేడుకల పోస్టర్ ను జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీ.వీ.రామ్, జనసేన వైద్య విభాగం అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు, కార్పొరేటర్ కందుల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అంచలంచలుగా ఎదిగి అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారన్నారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలను ఇంత అట్టహసంగా నిర్వహిస్తున్న కంచర్ల అచ్యుతరావు అభినందించకతప్పదన్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలలు విశాఖలో పండుగ వాతావరణం లో కొనసాగుతున్నాయని కొనియాడారు. ఎస్.ఎల్లాజీ రావు, అధ్యక్షులు చిరంజీవి యువత విశాఖ జిల్లా మాట్లాడుతూ ఈ ఏడాది బీచ్ రోడ్డులో అత్యంత ఘనంగా వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఈ వేడుకలకు కార్యక్రమ సూత్రధారి కంచర్ల అచ్యుతరావు,ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు తో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు అభిమానులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.