Blog

రైల్లో పోయిన బ్యాగు స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షం

User Rating: Be the first one !

విశాఖపట్నం ఆగస్టు 13: మీడియావిజన్ ఏపీటీఎస్ ప్రత్యేక ప్రతినిధి,

రైల్లో పోయిన బ్యాగు స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షం

ఇదేంటి అనుకుంటున్నారా.. విధి విచిత్రం అంతే… ఎక్కడో రైల్లో బ్యాగు పోవడం ఏంటి స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షం అనే సంఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి? చెన్నైకి చెందిన కార్తికేయనుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ వచ్చింది ఆ జాబు కోసం అతను వెళ్లే ప్రయత్నంలో ఈనెల 8న శబరి ఎక్స్ప్రెస్ లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరాడు. ఆ రాత్రి ట్రైన్ లో ఒక యువకుడు అతని పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడాడు. కొద్దిసేపటి తర్వాత మీరు పడుకోండి. నేను మీ బ్యాగు చూస్తాను అంటూ నమ్మబలికాడు. తెల్లవారి ఒంటిగంట, రెండు మధ్యలో కార్తికేయన్ చూడగా అబ్బాయికి కనిపించలేదు, బ్యాగ్ లేదు.దీంతో కంగారుపడిన కార్తికేయన్ నెక్స్ట్ స్టేషన్ ఒంగోలులో దిగి రైల్వే పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్లే అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బ్యాగులోని నగదు తో పాటు ల్యాప్టాప్, సర్టిఫికెట్లు, క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు పోవడంతో అతను ఎంతో దిగులు చెందాడు .ఈ క్రమంలో బ్యాగ్ దొంగిలించిన సదరు వ్యక్తి బ్యాగ్ లో ఉన్న నగదు 3000 తీసుకొని బ్యాగును పక్కన ఉన్న ఒక గూడ్స్ ట్రైన్ లో కి విసిరేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్రెయిన్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు కోసం వచ్చింది. ప్లాంట్ లోని సిడివై యార్డ్ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు damodar , tukaram, gajendra లోడింగ్ సమయంలో ఆ బ్యాగు చూసి తెరిచి చూడగా అందులో లాప్టాప్ ,సర్టిఫికెట్లు, కార్డులు అన్ని కనిపించేయి .వెంటనే అందులోనే ఆధార్ కార్డు ఆధారంగా కార్తికేయతో ఫోన్లో మాట్లాడారు. అతనికి ధైర్యం చెప్పారు. స్టీల్ ప్లాంట్ సిఐటియు గౌరవాధ్యక్షులు అయోధ్య రామ్ కు ఆ బ్యాగును అప్పగించారు. ఆ బ్యాంకు ను అయోధ్యరాం హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన కార్తికేయ ఎంతో సంతోషంతో ఇప్పటికీ దేశంలో నిజాయితీ పోలేదని ఈ సంఘటన రుజువు చేసింది అని తెలిపారు. ట్రైన్లో అపరిచితులను నమ్మవద్దు అని, బయటకు వెళ్లిన తర్వాత అతి జాగ్రత్తగా ఉండాలని తన అనుభవాన్ని తెలియజేసాడు. బ్యాంకు అందజేసిన కాంట్రాక్ట్ కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.

Related Articles

Back to top button