Blog

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు గుంటూరు దంపతులు ఆత్మీయ సత్కారం

విశాఖపట్నం : ఆగస్టు 10 మీడియావిజన్ ఏపీటీఎస్

విశాఖజిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావును విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం సీతమ్మధారలోని నర్సింహా మూర్తి నివాసంలో స్నేహపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం గుంటూరు వెంకట నర్సింహా రావు, గుంటూరు భారతీ దంపతులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్బంగా వంశీ మీడియాతో మాట్లాడుతూ
ఇది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని స్పష్టం చేశారు. నర్సింహామూర్తితో తనకు ఎప్పటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ప్రత్యేకం ఏమి లేదని రాజకీయాలకు అతీతంగా వచ్చానని, రానున్న రోజుల్లో అందరం కలిసి జర్నీ చేస్తామన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం శంకర్ మఠం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు
వంశీతో పాటు జనసేన డాక్టర్ సెల్ విభాగం చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కొయ్య ప్రసాదరెడ్డి, గుంటూరు చిన్ని, జనసైనికులు దుర్గ, సురేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button