విశాఖపట్నం జులై 30(మీడియావిజన్ ఏపీటీఎస్ )
జీవీఎంసీ 32 వ వార్డు లో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన మేమాల సముద్రమ్మ
సేవలు శ్లాఘనీయమని
విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కొనియాడారు.
ఆమె పదవి విరమణ చేయు సందర్భంగా తన కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఆమె వార్డు అభివృద్ధికి ఎంతో సహకరించారని చెప్పారు.ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఆమె సహాయపడటం హర్షనీయమని అన్నారు. ఒక అధికారిగా
వార్డుకు చేసిన ఆమె సేవలను ప్రజలు ఎవరూ మర్చిపోరని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో
32వ వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ కాశీ రావు , జీవీఎంసీ రిటైర్డ్ సూపర్డెంట్ మంత్రి శాలివాహన్ , మేస్త్రి కనకరాజు , సూపర్వైజర్ వెంకటలక్ష్మి , సోషల్ వర్కర్ విజయ రమణి, రమేష్ పాడి, సూరి కుమారి, నాగేంద్ర , సెక్రెటరీ సత్యబాల, పవన్ కుమార్, చిరంజీవి, కీర్తి, కుమారి, జనసేన యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్, కందుల కృష్ణ, జానకి, అరుణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.