Blog

సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పిలుపు

డిసెంబర్ 17, విశాఖపట్నం మీడియావిజన్ ఏపీటీఎస్

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు ఆధార్ అప్డేడేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు కోరారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుడూ, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో 6 నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు వారి ఆథార్ ను అప్డేట్ చేసుకోవడంతోపాటు, ఈ-శ్రమ్ కార్డులు కూడా పొందాలన్నారు. తద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రా కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ లో వివరాలు నవీకరణ చేసుకోవాలన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అడ్రస్, వివరాలు నమోదుకి అధికారికంగా అవకాశం కలుగుతుందన్నారు. ఇపుడు పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసర అయిందని… ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించిందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసిపోగా.. అన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యర్ధనల ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదని తెలియజేశారు.పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చునన్నారు. వెంటనే ఆధార్ వివరాలను పెద్ద ఎత్తున సినీ కార్మికులు నవీకరణ చేయించుకోవాలన్నారు. ఇప్పటికే అన్నిజిల్లాలకు ఈ సమాచారాన్ని పంపించామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని… అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయన్నారు. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకొని… వాటిని సవరించాల్సి వస్తే సవరించాలిని పేర్కొన్నారు. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలని… తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలన్నారు. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే… 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చునని డా.కంచర్ల అచ్యుతరావు వివరించారు. స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు, బాధ్యతగల మీడియా ఉచిత ఆధార్ అప్డేట్ పై సమాచారాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేస్తూ అన్ని వర్గాలప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ అవకాశాన్ని సినిమా కార్మికులంతా తప్పసరిగా సద్వినియోగం చేసుకోవాలని డా.కంచర్ల సూచించారు.

Related Articles

Back to top button