Blog

సెప్టెంబర్ 26 నుంచి రాజస్థాన్ లో మోంట్ అబూ లో జాతీయ మీడియా సదస్సు…. బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి రామేశ్వరీ వెల్లడి….. జర్నలిస్టులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి :జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు

విశాఖజిల్లా ప్రత్యేక ప్రతినిధి (మీడియావిజన్ ఏపీ టిఎస్ )

రాజస్థాన్ రాష్ట్రంలో గల మౌంట్ అబూ లో గల
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రం వద్ద జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మ కుమారీ స్ సంస్థ ప్రతినిధి రామేశ్వరూ తెలిపారు. ఆమె సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 26వ తేదీ నుండి 30 వ తారీఖు వరకు జరగబోయే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. దేశం నలు మూలల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటారు అన్నారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత పాఠ అవగాహన కల్పిస్తారు. విశాఖలో గల ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ చానల్స్ మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం అన్నారు. మానసిక, శారీరక దృఢత్వం కోసం సూచనలు, సలహాలు ఇస్తారు అన్నారు. ఈ సదస్సులో రాజ యోగ ధ్యానం, తదితర శేషన్లు జరుగుతాయి అన్నారు. సెప్టెంబర్ 27 న ఆరోగ్యకర – సంతోష కర సమాజం ఆధ్యాత్మిక సాధికారత – మీడియా పాత్ర అంశం మీద జాతీయ సదస్సు జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇక 28 న పాజిటివ్, నెగెటివ్ డ్యిమెన్షన్ ఆఫ్ సోషల్ మీడియా అంశం మీద ప్లీనరీ శేషన్ వుంటుంది అన్నారు. న్యాయ వాదులు, వ్యాయ మూర్తులు, మీడియా ప్రతినిధులకు పలు అంశాలు మీద శేషన్లు వుంటాయి. ఆధ్యాత్మిక ఉన్నతి తో పాటు, క్రమశిక్షణ తోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నారు. సెప్టెంబర్ 24 న విశాఖలో మీడియా ప్రతినిధులు బృందం రైలులో రాజస్థాన్ బయలు దేరుతారు అని తెలిపారు. సెప్టెంబర్ 29 న అక్కడ పలు ప్రాంతాలకు సైట్ సీయింగ్ కూడా వుంటుంది అన్నారు. బ్రహ్మ చేత తపస్సు చేయించిన మౌంట్ అబూ పరమ శివుని ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది అన్నారు.

ఈ నెల 3 న జాతీయ అవయవ దాన దినోత్సవం జరిగింది అని గుర్తు చేశారు. దేశంలో మధుమేహం కారణంగా కిడ్నీ తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అవయవ దానం కోసం ముందుకు రావాలి అని కోరారు. దానం చేసే వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తుంది అన్నారు. బ్రహ్మ కుమారీ సంస్థ సభ్యులు కూడా అవయవ దానం చేసారు అని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక భావాలు వుండే వారు అందరూ అవయవ దానం కోసం ముందుకు రావాలి అని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రం బ్రహ్మకుమారీ సంస్థ పేరు గాంచింది అన్నారు. బ్రహ్మ కుమారీ సంస్థ
ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నారు అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సీతల్ మాట్లాడుతూ, జాతీయ అవయవ దానం దినోత్సవం సందర్భంగా వీర మరణం సర్టిఫికెట్
మూడు లక్షల మంది రోగులు అవయవాలు కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు. కాబట్టి, ప్రజలు అవయవదానం కోసం ముందుకు రావాలి అని కోరారు.
సింహా చలం దేవస్థానం మాజీ ధర్మ కర్త
గంట్ల శ్రీనుభాబు మాట్లాడుతూ, బ్రమకుమారిస్ సంస్థ ఏటా జాతీయ మీడియా సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు ఈ సదస్సులో చర్చిస్తారు అన్నారు. అక్కడికి వెళ్ళిన వారు దివ్యానుభూతికి లోనవుతున్నారు అని తెలిపారు. ఇది దేవ దూత ఆహ్వానంగా భావించాలి అని కోరారు. మంచి విషయాలు నేర్చుకునే వేదికను విశాఖ మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సమక్షంలో బ్రహ్మ కుమారీ సంస్థ పలు పర్వ దినాలలో లు కూడా నిర్వహిం చడం జరుగుతుంది అని గుర్తు చేశారు. పరమాత్ముని సందేశం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మ కుమారీ సంస్థ విస్తృత ప్రచారం చేస్తున్నారు అన్నారు. అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన ఇంకా పెరగాలి అని అభిప్రాయ పడ్డారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్టు
నాగ రాజు పట్నాయక్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు శిక్షణ కోసం ఏటా బ్రహ్మ కుమారీ సంస్థ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యం, ఆనందం తో కూడిన సమాజం చూడాలి అంటే మీడియా పాత్ర ఏమిటి అన్నది ఈ సదస్సులో చర్చిస్తారు అన్నారు. విశాఖ జర్నలిస్టులు ఈ సదస్సు విజయ వంతం చేయాలి అని కోరారు.

ఏ ఎం సీ అనాటమీ హెచ్ ఓ డి డాక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, అవయవ దానం కోసం ప్రజలు ముందుకు రావాలి అని కోరారు. బ్రహ్మ కుమారీ సంస్థ ఈ విషయంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు.
మీడియా సమావేశంలో బ్రహ్మ కుమారీ సంస్థ సభ్యులు సిద్దు, మురళీ కృష్ణ, సునీత, నారాయణ, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

ఈశ్వరియ సేవలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం. సంప్రదించుటకు ఫోన్ నెంబర్ 8555857990 బ్రహ్మకుమారి రామేశ్వరి

Related Articles

Back to top button