Blog

ఉత్సాహభరితంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడ : మార్చి 20, (మీడియావిజన్ ఏపీటీఎస్ )

విజయవాడ ఏ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసంగా, ఆనంద భరిత వాతావరణంలో జరిగాయి.. ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లను సైతం కడుపుబ్బ నవ్వించాయి.. ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక పోటీల్లో ఎవరికి వారు పోటీపడి తమ ప్రదర్శనలను ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్ లు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు.. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నేను 1983 నుంచి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కాలం నుంచి ఎమ్మెల్యే గా పనిచేసానన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకు వెళ్లుతున్నామన్నారు. అప్పట్లో ఎప్పుడూ ప్రజాప్రతినిధుల స్పోర్ట్స్ జరుగుతుండేవని, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొని దుర్యోధనుడి పాత్ర వేసి మొదటి ప్రైజ్ గెలుచుకున్నారన్నారు. ఇది సాంస్కతి కార్యక్రమాలకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఇచ్చిన తోడ్పాటుకు నిదర్శనం అన్నారు. అదే ఒరవడిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ క్రీడల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించారన్నారు. విజయవాడ నగర వాసులు సైతం ప్రజాప్రతినిధుల క్రీడలను చూసేందుకు తరలివచ్చారన్నారు. తక్కువ సమయంలోనే తోడ్పాటు అందించిన ఆర్థక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, సిబ్బంది అందరినీ ఈ సందర్బంగా స్పీకర్ అభినందించారు..కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ విప్ లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధితాధికారులు, తదితరలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button