News

జాతీయ స్థాయి ఎంట్రీ సాధించిన ఆఫీషన్ మహమ్మద్

విశాఖపట్నం : జులై 29 (మీడియా విజన్ ఏపీటీఎస్ )

భీమవరంలో జులై 27 నుంచి రెండు రోజులపాటు జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 11 చదరంగం పోటీలు ఘనంగా ముగిసాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో విశాఖ జిల్లాకు చెందిన ఆఫీషిన్ మహమ్మద్ ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం ద్వారా తెలంగాణలో త్వరలో జరిగే జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఆఫీషిన్ మహమ్మద్ ఎంపిక అయింది. ఈ సందర్బంగా విశాఖ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రంగాల బాబూరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎంట్రీ సాధించడం విశాఖ జిల్లాకే గర్వకారణం అన్నారు. ఆఫీషిన్ తల్లిదండ్రులు, కోచ్ కు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ మణికంఠరావు, వి శ్రీకాంత్, ఉమామహేశ్వర రావులు హర్షం వ్యక్తం చేశారు. కాగా చెస్ టోర్నమెంట్ లో 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button