విశాఖపట్నం, సెప్టెంబర్ 8 : (మీడియావిజన్ ఏపీటీఎస్ )
ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సోమవారం (సెప్టెంబర్ 09న) విశాఖపట్నం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటించిన్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.