– జివిఎంసి కమిషనర్ పి.సంపత్ కుమార్ .
విశాఖపట్నం ఆగస్టు 13: మీడియావిజన్ ఏపీటీఎస్ మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగం వార్డు ప్లానింగ్ కార్యదర్శులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జివిఎంసి కమిషనర్ పి.సంపత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన వి.ఎం.ఆర్.డి.ఎ. చిల్డ్రన్ ఎరీనా థియేటర్ లో పట్టణ ప్లానింగ్ విభాగపు అధికారులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ నగరంలో గల భవన నిర్మాణాల అనుమతుల మంజూరు, అనధికార కట్టడాలు, ప్రభుత్వ స్తలాల ఆక్రమణలు, ప్రజా ఫిర్యాదుల విషయమై ప్రజల నుండి అధిక శాతం పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించినవే వస్తున్నాయన్నారు. ఈ విషయమై ఎ.పి.డి.పి.ఎం.ఎస్. ఆన్లైన్ పోర్టల్ నందు బిల్డింగ్ అనుమతులకు సంబంధించి ఎక్కువ రోజులు చర్యలు చేపట్టక పోవడంపై వార్డు ప్లానింగ్ కార్యదర్శుల విధులు బాధ్యతారహితంగా కనిపిస్తున్నాయని పలువురు కార్యదర్శులపై కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్డింగ్ నిర్మాణాల అనుమతుల మంజూరుపై వెంటనే చర్యలు చేపట్టడం, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, అనధికార నిర్మాణాలను నిలువరించడం, ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించే దిశగా ప్లానింగ్ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కమీషనర్ ఆదేశించారు. ఇకపై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై తప్పకుండా తీసుకొనే కఠినమైన చర్యలకు గురికాకుండా, ప్లానింగ్ కార్యదర్శులు నిజాయితీ, క్రమశిక్షణతో పని చేయాలని కమీషనర్ ఆదేశించారు. నిబద్ధతతో పని చేసే ప్రతి ప్లానింగ్ కార్యదర్శులను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందిస్తామని కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సమీక్షలో ముందుగా పట్టణ ప్రణాళిక విభాగము విధివిధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జివిఎంసి ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి బి.సురేష్ కుమార్ కమీషనర్ కు వివరించారు. అనంతరం కమీషనర్ సూచనలను తూచా తప్పకుండా పాటించే విధంగా పట్టణ ప్రణాలికా విభాగాన్ని బలోపేతం చేస్తామని కమీషనర్ కు ఆయన తెలిపారు.సమీక్షలో సిటి ప్లానర్ మహాలక్ష్మి దొర, డిసిపిలు కె.పద్మజ, రామలింగేశ్వర రెడ్డి, దవళ శ్రీనివాసరావు, ఎసిపిలు, టిపిఒలు, టిపిఎస్ లు, టిపిబిఒలు, ఆర్ఎఫ్ఒ హనుమంతరావు, టౌన్ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.