ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధి బిజెపి ప్రజాప్రతినిధులు. బిజెపి ఫ్లోర్ లీడర్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణు కుమార్ రాజు…………….
విశాఖపట్నం ఆగస్టు 13: మీడియావిజన్ ఏపీటీఎస్ ప్రత్యేక ప్రతినిధి
ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధిగా బిజెపి ప్రజా ప్రతినిధులు వ్యవహరించ నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు , పట్టణాలు వారీగా ఉన్న మౌలిక సమస్యలే ప్రధాన అంశంగా సామూహిక సమస్యలు పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది.వారధి కార్యక్రమం బిజెపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 15 వతేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభిస్తారు . ఆనాటి నుండి నిరంతర ప్రక్రియగా సమస్యల స్వీకరణ కొనసాగించడం జరుగుతుందిఅదేవిధంగా ప్రజల నుండి స్వీకరించిన వినతులను రాష్ట్ర కార్యాలయం ఆధారంగా పరిష్కారానికి క్రుషి చేయడం జరగుతుంది.బిజెపి ప్రజా ప్రతినిధులు రోజుకు ఒక్కరు రాష్ట్ర కార్యాలయంలొ అందుబాటులో ఉంటారు . ఆదివారం మినహా వర్కింగ్ డేస్ అన్నిరోజులు ప్రజల వద్ద నుండి సమస్యలు స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులకు సహకారంగా రాష్ట్ర పదాదికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారువచ్చిన సమస్యలను ఏ ప్రభుత్వ శాఖ పరిధిలోకి వస్తుందన్న విషయం పరిశీలించి ఏస్ధాయి అధికారి కి ఈ సమస్య వెళితే పరిష్కారం అవుతుందన్న ది పరిశీలించి వారికి పంపించడంతో పాటు సమస్యస్ధాయిని బట్టి రాష్ట్ర కార్యాలయం ఆధారంగా సమస్య పరిష్కారం చేసేంత వరకు పని చేయడం జరుగుతుంది అదేవిధంగా సమస్య పరిష్కారం వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఒక సాఫ్ట్ వేర్ వినియోగించడం జరుగుతుంది.