కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ లో దసరా సంబరాలు… అమ్మవారి వేషధారణలతో అలరించిన చిన్నారులు…. చెడు పై మంచి విజయం సాధించడమే దసరా……. స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సాయిలక్మి
విశాఖపట్నం, అక్టోబర్ 9 : మీడియావిజన్ ( ఏపీటీఎస్ )
ఎం.వి.పి.కాలనీ, ఉషోదయ జంక్షన్ వద్ద గల కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ లో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు దుర్గాదేవి, సరస్వతీదేవి, కాళికాదేవి మొదలైన దేవతల వస్త్రాలంకరణలతో సంప్రదాయకంగా విచ్చేసి, అందరినీ అబ్బురపరించారు
అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సాయిలక్మి మాట్లాడుతూ
విజయదశమి మన మందరికి విజయాన్ని, శుభాలను అందించాలని ముందు తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించాలని తెలియజేశారు.
దసరా అంటే విజయదశమి రోజును అసత్యంపై సత్యం, పాపంపై పుణ్యం సాధించిన విజయంగా జరుపుకుంటారని చెప్పారు.
ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని ఇచ్చాడని వెల్లడించారు. విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడిని ఓడించిందని, ఈ విజయదశమి రోజున శమీ, అపరాజితలను పూజిస్తారని అన్నారు.
దసరా పండుగ వర్షాకాలం ముగింపు అని అలాగే శరదృతువు ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుందని తెలియజేసారు.
దసరా రోజున కొన్ని చోట్ల దుర్గామాత విగ్రహం, కలశం (దుర్గా పూజ శుభ ముహూర్తం) నిమజ్జనం చేస్తారని, ఇంకొన్ని చోట్ల రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారని, విజయదశమి రోజున నీలకంఠుడు (పాలపిట్ట) అనే పక్షిని చూడటం శుభప్రదంగా భావిస్తారని పేర్కొన్నారు.
దసరా రోజున హనుమాన్తో పాటు శ్రీరాముడు, తల్లి దుర్గా, గణపతి బప్పాను పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక బృందంతో పాటు విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొన్నారు.