Blog

అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు కమ్యూనిస్టులు చిరు సాయం

విశాఖ పెందుర్తి అక్టోబర్ 13: మీడియావిజన్ ఏపీటిఎస్

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ సోదరుడు గరికన ఈశ్వరరావు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పెందుర్తి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి శ్రీను, సహాయక కార్యదర్శి రాంబాబు ఆర్థిక సహాయం అందించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేము ఉన్నామని అదేర్య పడవద్దని ఈశ్వరరావు కి కుటుంబ సభ్యులకి భరోసా కల్పించారు.. అయితే రానున్న పది రోజుల్లో ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేశారని… ఆపరేషన్ కి సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని ఈశ్వర్ రావు తెలిపారు.. ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన జర్నలిస్ట్ సోదరులకు రాజకీయ నాయకులు, ప్రజా సంఘ నేతలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు… ఈశ్వర్ కీ ఆర్థికంగా సహాయం అందించాలనుకున్నవారు వారి తమ్ముడు గరికిన రాజుకి ఈ క్రింది ఫోన్ పే నెంబరుకు చేయవలసిందిగా కోరారు.

గరికిన రాజు ఫోన్ ఫే నెంబర్ :: 98858 53547

Related Articles

Back to top button