విశాఖపట్నం, సెప్టెంబర్ 2 :
(మీడియావిజన్ ఏపీటీఎస్, స్టేట్ బ్యూరో )
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ సింహాచలం లక్ష్మినృసింహ స్వామిని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని తులసిమాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకుని శ్రీ సింహాద్రి అప్పన్నను వేడుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ద్వయవతార రూపుడైనా శ్రీ సింహాచల స్వామిని దర్శించుకోవడం ఎంతో ముక్తిని కలిగిస్తుందన్నారు. ఆయన ఉగ్ర అవతారం విశాఖ సింహాచలంలో చల్లని చందనంలో దర్శనమివ్వడం మన అదృష్టమన్నారు.