విశాఖపట్నం, ఆగస్టు 8: మీడియావిజన్ ఏపీటీస్ ప్రతినిధి
సేవా కార్యక్రమాల ద్వారా
సమాజంలో పేదవారికి ఆపన్న హస్తం అందించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. నగరంలోని సంకల్ప సేవా సమితి సభ్యులు ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో బుధవారం కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా గంటా చెప్పారు. 13 ఏళ్లుగా సమితి చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రశంసించారు. గంటాను కలిసిన వారిలో సంకల్ప సేవా సమితి అధ్యక్షుడు కొమ్మన శ్రీనివాసరావు, అందే మహేష్, దాసరి సురేష్ బాబు, ఎం.శివ, ఎన్.మాధవరావు, ఎన్.వి.సత్యనారాయణ, తిరుపతి నాయుడు, బి. సత్యనారాయణ, బొచ్చ సురేష్ కుమార్, స్వరూప్, తలాటం వీర రాఘవరావు, మేడిది రాజశేఖర్, హరి ప్రసాద్, అడబాల నాని, కొట్టు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.