Blog

ఆరిలోవ హెల్త్ సిటీలో మెడ్సీ అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ప్రారంభం

మెడ్సీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం :హెల్త్ సిటీ, ఏప్రిల్ 6

(మీడియావిజన్ ఏపీటీఎస్ హెల్త్ డెస్క్)

దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఆరోగ్య ప్రధాయినిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరిలోవ హెల్త్ సిటీలో మెడ్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సి బొత్స సత్యనారాయణ అన్నారు. లక్ష అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల భవనంలో 108 పడకల తో అత్యాధునిక టెక్నాలజీ తో నిర్మితమైన మెడ్సీ హాస్పిటల్ ను చైర్మపర్సన్ అండ్ మేనే్జింగ్ డైరెక్టర్ డాక్టర్ శిరీషరాణి తో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శిరీషారాణి, విజయవాడ మెడ్సీ ఇంచార్జ్ డాక్టర్ పద్మజ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఆరిలోవ బ్రాంచ్ ఎనిమిదవది అన్నారు.తమ హాస్పటల్లో అన్ని విభాగాలలో నిర్దిస్టులైన వైద్య బృందం తో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబందించిన ప్రసుతి వైద్యం తో పాటు ఎల్ వీ ఎఫ్ విభాగాన్ని ఐదవ అంతస్తులో నూతన సాంకేతికతతో ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక చిన్ని పిల్లల వైద్యానికి అన్ని వేళల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. తల్లీపిల్లల ఆరోగ్యానికి తమ హాస్పటల్లో ఓ ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అంతేకాక ఆర్థో, పిడియాట్రిక్,గైనిక్,యురాలజీ, నెఫ్రాలజీ, లేప్రోస్కోపిక్,ఆండ్రాలజీ, ఎండోక్రోనాలాజీ, కార్డియాక్ తో పాటు రోబోటిక్ సర్జరీ మెడ్సీలో అందుబాటులో ఉంటాయన్నారు.ఎమర్జన్సీ పేషంట్స్ కోసం ఐదు ఐసీయూ రూముల్లో 54 బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.తమ వద్దకు వచ్చే వారికి అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సి పి వీ ఎన్ మాధవ్,హాస్పిటల్ ఎండీ బొత్స అనూష, వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్,వైద్యులు నవనీత్, వై. ఎల్. ఎన్. రావు, పద్మావతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button