ఎంవీపి కిడ్స్ గార్డెన్స్ పబ్లిక్ స్కూల్లో పలు సేవా కార్యక్రమాల మధ్య ‘అమెరికా చిన్నారి ఆరా’జన్మదిన వేడుకలు…. నిరుపేద విద్యార్థులకు షూష్, మహిళలకు చీరలు పంపిణి చేసిన ఆరా తల్లితండ్రులు సూర్య, చైత్రిక
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 : (మీడియావిజన్ ఏపీటీఎస్ న్యూస్ )
నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కు పేదరికం అడ్డు కాకూడదని, తమ సంపాదనలో ఎంతో కొంతమంది పేద విద్యార్థుల ఉన్నతికి చేయూత కావాలనే ఉన్నతాశయంతో అమెరికా టెక్సస్ కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యగి సూర్య, చైత్రిక దంపతులు ఎంవీపి కిడ్స్ గార్డెన్స్ స్కూల్స్ విద్యార్థులు నరుగురిని దత్తత తీసుకుని విద్యనందిచడం పట్ల పలువురు హార్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక తమ కుమార్తె ఆరా పుట్టినరోజు టీచర్స్ డే రోజు కావడం తో ఆ వేడుకలను పురస్కరించుకొని కిడ్స్ గార్డెన్స్ లో విద్యార్థులు తల్లితండ్రుల మధ్య అత్యంత ఘనంగా చేసుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయిలక్ష్మి మాట్లాడుతూ సూర్య, చైత్రిక దంపతులను అభినందించారు. సమాజంలో మార్పు రావాలని, విద్య పేదరికంతో ఆగిపోకూడదని తమ వంతుగా వారు అందిస్తున్న ప్రోత్సహన్ని కొనియాడారు. విద్యార్థులకు ఆర్థిక సాయం చెయ్యడమే కాకా తమ కుమార్తె పుట్టినరోజు వేడుక సందర్బంగా పిల్లలకు, స్కూల్ షూస్, నిరుపేదలకు చీరలు పంపిణి చెయ్యడం వారి దాత్రుత్వానికి నిదర్శనమన్నారు. ఇటువంటి దాతలు మరింతమంది ముందుకొస్తే నిరుపేదలకు విద్యాదానం చేసినవారుగా నిలుస్తారని పిలుపునిచ్చారు.