Blog

ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న “తెలుగు శక్తి” బి.వి.రామ్

  • తెలుగు జాతి ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా తెలుగు శక్తి నిరంతర పోరాటం

వైసిపి నాయకులతో విధానపరమైన పోరాటం తప్ప వ్యక్తిగత పోరాటం కాదు

 ----- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

విశాఖపట్నం: ఆగస్టు 13: ( మీడియావిజన్ ఏపీటీఎస్ ) తాను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించినప్పటికీ.. బొత్స మాటపై గౌరవంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ప్రకటించారు. మంగళవారం.. వీ జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియా సమక్షంలోనే బొత్స సత్యనారాయణతో ఫోన్లో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నామినేషన్ వేసేందుకు తను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే నామినేషన్ సమయంలో సంతకాలు పెట్టేందుకు పదిమంది కార్పొరేటర్లు /ఎంపీటీసీలు / జెడ్పిటీసిలు సంతకాల అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం, జనసేన పార్టీలలో తనకు తెలిసిన వారు ఉన్నప్పటికీ వారిని సంతకం పెట్టాల్సిందిగా కోరడం సమంజసం కాదని.. అందుచేత సంతకాలు పెట్టాల్సిన పది మందిని మీరే పంపించాల్సిందిగా కోరారు. దీనిపై బొత్స స్పందిస్తూ పెద్దల సభకు పోటీ లేకుండానే ఎంపిక అయితే గౌరవం ఉంటుందని చెప్పడంతో తాను ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బి.వి.రామ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా తనకు తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీలతోను సత్సబంధాలు ఉన్నాయని.. వైసిపి నాయకులను కేవలం విధానపరంగానే వ్యతిరేకించాను తప్ప వ్యక్తిగతంగా ఏనాడు విమర్శించలేదన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు శక్తి నిరంతరం పోరాటం చేస్తుందని.. తెలుగు జాతి అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తమ పోరాటం కొనసాగిస్తామని బి.వి.రామ్ ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

Back to top button