Blog
Trending

కంచర్ల అచ్యుతరావు కు సీనారె పురస్కారం ప్రదానం....

విశాఖపట్నం జులై 30( మీడియావిజన్ ఏపీటీఎస్ )

సమాజ సేవకు అంకితమై విశేష సేవలందిస్తున్న కంచర్ల అచ్యుతరావు కు సి నారె ఆత్మీయ పురస్కారం అందజేయడం హర్షణీయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94 వ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళా పీఠం ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా. కంచర్ల అచ్యుత రావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సాహిత్యం ద్వారా రేలుగు పాటకు జీవం పోషిన మహనీయులు ఆత్రేయ, సీనారె అని కొనియాడారు. ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ విశ్వ వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన గాయకులతో పాడించి ఆకట్టుకోవడం లో నిర్వాహకుల కృషిని అభినందించారు. పురస్కార గ్రహీత కంచర్ల మాట్లాడుతూ సినారె పేరిట అవార్డు అభించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. కళల్ని, కళాకారుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానాన్నారు. పీఠం  ప్రధాన కార్యదర్శి గంటి మురళీ అధ్యక్షన వహించిన కార్యక్రమంలో  పైడా కృష్ణ ప్రసాద్, సూరపనేని విజయ్ కుమార్, గ్రంధి విష్ణు, ఉశిరికల చంద్ర శేఖర్, చెన్నా తిరుమలరావు, శోభన్ ప్రకాష్, ఎస్ఎస్ఎస్ ఎన్ రాజు ఉమా మహేష్, వ్యాఖ్యాత లక్ష్మీ స్వరూప తదితరులు పాల్గొన్నారు.


*అలరించిన సీనారె విరాచిత గీతాలు.* తొలుత నిర్వహించిన సంగీత విభావరిలో రాజేంద్ర ప్రసాద్, సౌజన్య పాడిన మనసు పాడింది సన్నాయి పాట, రమేష్ పట్నాయక్, ధరణి పాడిన మనసే జతగా మారిందిలే, జోగారావు, శిరీష పాడిన బుగ్గ జిల్లగానే సరిపోయిందా వంటి సినారె రాసిన గీతాలు ఆలపించి ప్రేక్షకుల్ని అలరించారు. జివి ఎల్ పాడిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున కంచర్ల అభిమానులు పాల్గొని వారిని సన్మాణించుకున్నారు

Related Articles

Back to top button