Blog
కలుషిత ఆహారం తిని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్….
విశాఖపట్నం ఆగస్టు 20:(మీడియావిజన్ ఏపీటీఎస్, ఆరోగ్య విభాగం ప్రతినిధి )
కలుషిత ఆహారం తిని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులనుదక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై స్థానిక వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 39 మంది చిన్నారుల్లో 24 మంది క్షేమంగా ఉన్నారని 12 మందికి చికిత్స పొందుతున్నారని, 3 అత్యవసర చికిత్స పొందుతున్నారని తెలిపారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్, వై,ద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు .కార్యక్రమంలో కూటమి శ్రేణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.