Blog

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ నేపథ్యం లో ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ని సహచర ఎంపీలు రాష్ట్ర అధ్యక్షులురాలు శ్రీ మతి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ తో కలసి రాష్ట్ర ప్రజలు తరుపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.అనకాపల్లి ఎం.పీ సీ.ఎం రమేష్ ప్రధాని మోడీ ని దుశ్శలువతో సత్కరించి సహచర సభ్యులు తో కలసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్బంగా సీ.ఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటు రాష్ట్రం లోనూ, అటు కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున మంచి ఫలితం వచ్చిందన్నారు.ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రధాని రాష్ట్రానికి హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారన్నారు.భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ వలన ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజధాని నగర కల, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

Related Articles

Back to top button