Blog

కృష్ణదేవిపేట ఎస్ఐ దివ్యకు వైఎస్సార్సీపీ నేతల శుభాకాంక్షలు

కృష్ణదేవిపేట, సెప్టెంబర్ 15 : ( మీడియావిజన్ ఏపీటీఎస్ )


కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన టి.దివ్యను నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ స్టేషన్ కు మహిళా ఎస్ఐ రావడం ఇదే తొలిసారని. ఇప్పటి వరకూ చాలా మంది ఎస్ఐలు మారినా ఎన్నడూ మహిళా ఎస్ఐలు రాలేదన్నారు. మొట్టమొదటిసారిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళా ఎస్ఐలు స్టేషన్ అధికారులుగా రావడం వలన మహిళల సమస్యలు సత్వరం పరిష్కారం కావడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యర్రా శ్రీనివాసరావు, యర్రా నాగేశ్వరరావు, యలమంచిలి ఎస్వీ రామణారావు, అప్పన కృష్ణ, లంక లోవనారాయణ, వాసం లోవ, లంక శివ, యర్రా బాబులు, అప్పన చిన్ని, గొంతిన సూరిబాబు, చేపూరి కృష్ణ, తురంగల చిన్న, గాజుల లోవ, కూనిశెట్టి యేసు, అప్పన చిన రమణ, కూనిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button