Blog

కోబ్బరి తోటలో శ్రీ లలిత దుర్గా నూకాంబిక ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం… ఆర్థిక సహాయం ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ మెంబర్ జి వి రామచందర్రావు

విశాఖపట్నం, అక్టోబర్ 12 : (మీడియావిజన్ ఏపీటీఎస్ )

కోబ్బరి తోటలో వెలసిన శ్రీ లలిత దుర్గా నూకాంబిక ఆలయంలో శనివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు జివి రామచందర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. సుమారు 2వేల మందికి నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశిస్సులు ప్రజలందరికి ఉండాలని అక్కక్షించారు. అన్ని ధానాల కన్నా అన్నదానం మిన్న అనే నానుడికి కట్టుబడి ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు టేకుమూడి లక్ష్మణ్, ఉమ్మడి గురుమూర్తి ఆచంట వేణు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button