Blog

క్రోంచెట్ స్క్వెర్స్ తయారీతో మహిళా మనోవికాస్ కి మూడవసారి గిన్నిస్ రికార్డు

User Rating: Be the first one !

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 : ( మీడియావిజన్ ఏపీటీఎస్ )

  • 450 మంది మహిళలతో 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ తయారీ
  • వరుసగా మూడో సారి హ్యాట్రిక్ గిన్నిస్ రికార్డు
  • మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి సూరిభట్ల నేతృత్వంలో 450 మంది అన్ని వయసుల చిన్నారులు, యువతులు,మహిళలు, వృద్దులతో కలిసి అతి తక్కువ సమయంలో 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ మహిళలుధరించే నూలు వస్త్రం ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ సందర్బంగా నగరంలో వెంకోజీపాలెం చందన మోహనరావు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో
    58,112 క్రోచెట్ స్క్వేర్స్ న్ను ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి ‘లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోంచెట్ స్క్వెర్స్ ‘గా గిన్నిస్ రికార్డును ధృవీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధి ఇంటెక్ విశాఖపట్నం మాజీ కన్వీనర్
    మయక్ కుమారి డియో,గౌరవ అతిధి క్రాఫ్ట్స్ కౌన్సిల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ డా. రేణుక రాణి, స్పెషల్ గెస్ట్ హెరిటేజ్ నారేటర్ వైజాగ్ జయశ్రీ హతన్గడి తో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు. అనంతరం మాధవికి ధ్రువపత్రంఅందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా
    డుతూ గిన్నిస్ రికార్డు కోసం సాధారణంగా 20 వేల క్రోంచెట్ స్క్వెర్స్ తయారు చేయాల్సి ఉండగా 58,112 తయారు చేసి, అతిపెద్ద ప్రదర్శనను ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారని మహిళా మనో వికాస్ బృందాన్ని అయన ప్రశంసించారు.
    మయక్ కుమారి డియో
    మాట్లాడుతూ.. వయసు తో సంబంధం లేకుండా మహిళల మనోవికాశానికి దోహదపడే విధంగా ఇటువంటి బృహతర కార్యక్రమం చేపడుతున్న మాధవిని కొనియాడక తప్పదన్నారు.దేశవిదేశాలకు చెందిన 450మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొవడం మహిళల్లో ఉన్న ఆత్మ స్టైర్యాన్ని నిరూపిస్తుందన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు మాధవి సూరిభట్ల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలనీ ఏకం చేస్తూ ఈ గిన్నిస్ రికార్డు మూడో సారి సాధించమన్నారు..ఈ గ్రూప్ లో 6 ఏళ్ళ చిన్నారి నుంచి 86 మహిళా ఉన్నట్టు చెప్పారు.వీటిని స్వెర్టర్స్, షాల్స్, తయ్యారు చేసి నిరుపేదలు,ఆనాధలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.తనకు వ్యక్తిగతంగా 8 వ సారి, బృందానికి 3 వ సారి గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో మరిన్ని రికార్డులను నెలకొల్పి తద్వారా సమాజానికి మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమం లో సంస్థ సభ్యులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button