విశాఖపట్నం, సెప్టెంబర్ 22 : (మీడియావిజన్ ఏపీటిఎస్ )
సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన వేండ్ర త్రినాథరావు ఆదివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు కృషి చెయ్యాలని ఈ సందర్భంగా ఇ.ఓ.కు గంటా సూచించారు. సింహాచలం దివ్యక్షేత్రం ప్రణాళికపై దృష్టి సారించాలన్నారు. ప్రసాదాల కోసం వాడుతున్న రైతు డెయిరీ నెయ్యిని శనివారం సీజ్ చేసిన నేపథ్యంలో ప్రసాదాల తయారీకి ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయంగా విశాఖ డెయిరీ నెయ్యి వాడుతున్నామని గంటాకు త్రినాథరావు వివరించారు. కార్పొరేటర్ పి.వి.నరసింహం, ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈఓలు ఎన్.ఆనంద్ కుమార్, రమణమూర్తి, ఈఈ శ్రీనివాస రాజు, డీఈలు రాంబాబు, హరిరాజు తదితరులు పాల్గొన్నారు.