- ఆగస్టు 1 నుంచి అర్జీలు స్వీకరణ
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 1వ తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్ధనలు, సూచనలు స్వీకరిస్తారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా కనీసం రెండు రోజులపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, వారు చెప్పే సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుకోవాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ మేరకు పార్టీ ప్రజా ప్రతినిధులు కేంద్ర కార్యాలయంలో ఉండే షెడ్యూల్ సిద్ధం చేశారు. ఒక్కో ప్రజా ప్రతినిధి రెండు రోజులపాటు కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉంటారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే అభ్యర్ధనలు, సూచనలు స్వయంగా స్వీకరిస్తారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలో తేదీలవారీగా అందుబాటులో ఉండనున్న జనసేన ప్రజా ప్రతినిదుల వివరాలివి…