Blog

జర్నలిస్టులకు పరామర్శ.. ఓదార్పు…. మనసున్న మారాజు గంట్ల శ్రీనుబాబు…. పలువురు జర్నలిస్ట్ లకు సాయంగా 50 వేలు …..

విశాఖపట్నం ఆగస్టు 13 : (మీడియావిజన్ ఏపీటీఎస్, స్టేట్ బ్యూరో )

నగరానికి చెందిన పలువురు జర్నలిస్టులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా వారిని మంగళవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు పరామర్శించి, దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సీనియర్ వీడియో జర్నలిస్టు శివ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా వారి కుటుంబ సభ్యులు కేరళలో చికిత్స అందిస్తున్నారు. కొంత కోలుకున్నప్పటికి ఇంకా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అప్పట్లో రెండుసార్లు చికిత్సకు సాయం అందించిన శ్రీనుబాబు తాజాగా మరో రూ.5వేలు అందజేశారు. ఇక ఎన్ టివిలో వీడియో జర్నలిస్టుగా సేవలందిస్తున్న శ్రీధర్ కొద్దిరోజుల క్రితం తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కుడి చేయి విరిగిపోగా తలపైన తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీధర్ ను పరామర్శించి రూ 5వేలు అందజేసారు. ఇక మరో సీనియర్ పాత్రికేయుడు కుటుంబానిరి రూ 10 వేలు నగదు సాయం అందజేశారు.
విద్యా సాయం కింద రూ.30 వేలు విరాళం
ఇక నగరానికి చెందిన వీడియో జర్నలిస్టు పి.ఎస్.బి.సతీష్ బాబు కుమారుడు సిద్దు ఇటీవలే ఉన్నత విద్య కోసం ఒక యూనివర్సిటీలో చేరారు. దీంతో అతని ఫీజు నిమిత్తం గంట్ల శ్రీనుబాబు మంగళవారం రూ.10వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. తనతో పాటు ఆంధ్రాయూనివర్సిటీలో విద్యాభ్యాసం సాగిస్తున్న మరో విద్యార్ధినికి ఫీజు నిమిత్తం రూ.20వేలు సాయం అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కేవలం వృత్తిపైనే ఆదారపడి జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు అనేక మంది తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు, ప్రమాదాల బారిన పడి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వారిని పరామర్శించి తన పరిధి మేరకు సాయం చేయాలని భావించి ఈ చిరు సహాయం అందజేసినట్లు చెప్పారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సదుపాయాలుతో పాటు పిల్లలకు ఫీజు రాయితీ, ఇళ్ల స్థలాలు కల్పించినట్లు అయితే చాలా వరకు ఆయా కుటుంబాలకు భరోసా కలుగుతుందన్నారు. తాను చేసింది చిరు సహాయమే అయినప్పటికి వారికి కొంత తోడుగా ఉంటుందని, ఇతరులు కూడా సహాయం చేసేందుకు దోహదపడుతుందని శ్రీనుబాబు పేర్కొన్నారు.

Related Articles

Back to top button