Blog

జర్నలిస్ట్ క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం కావాలి: ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా కొనసాగుతున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్ని 2024

డిశంబర్ 17, విశాఖపట్నం మీడియావిజన్ ఏపీటీఎస్ (స్పోర్ట్స్ రిపోర్టర్ )

రెండో రోజు మ్యాచ్లో విజయం సాధించిన వెబ్ టైగర్స్, MSO వారియర్స్

ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు సహాయసహకారంతో
విశాఖ ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో నిర్వహిస్తున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్ని 2024 అత్యంత ఘనంగా కొనసాగుతుంది.
రెండొవరోజు జరిగిన టోర్నిలో మెదటిగా వెబ్ వారియర్స్ తో వెబ్ టైగర్స్ తలపడగా తొలి బ్యాటింగ్ చేసిన వెబ్ టైగర్స్ నిర్ణత 18 ఓవర్లలో 132/7 పరుగులు చేయగా వెబ్ వారియర్స్ 128/7 పరుగులు చెయ్యగా వెబ్ టైగర్స్ విజయం సాధించి సెమీఫైనల్స్ కు చెరికుంది. మధ్యానం జరిగిన మ్యాచ్ లో లోకల్ MSO వారియర్స్ vs ప్రజాశక్తి తలపడగా నిర్ణత 15 ఓవర్లలో లోకల్ వారియర్స్ 140/4 చేయగా ప్రజాశక్తి టీం 137/5 చేయడంతో లోకల్ వారియర్స్ విజయం సాదించి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. విజయం సాధించిన ఇరు జట్టులకు ఉపకార్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు శుభాకాంక్షలు తెలియజేశారు.* ఇది కేవలం జర్నలిస్టులు ఆటవిడుపు కోసం జరుగుతున్న క్రీడాలు కనుక గెలుపు ఓటములు కోసం కాకుండా క్రీడా స్ఫూర్తి తొ ముందుకు సాగాలన్నారు. క్రీడాలపై ప్రతీ ఒక్కరూ మక్కువ పెంచుకునేందుకు జర్నలిస్ట్ క్రీడలు దోహతపడతాయన్నారు*. జర్నలిస్టులను ఆదర్శంగా తీసుకొని యువక్రీడాకారులు ముందుకు వచ్చి దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా కృషిచేయ్యాలని పిలుపునిచ్చారు.అట విడుపుగా ఇటువంటి క్రీడాలను ఎప్పటికప్పుడు నిర్వహించుకునే దిశగా పాత్రికేయులు ముందుకుసాగాలని అక్కక్షించారు.

Related Articles

Back to top button