Blog

తెలుగు సినీపరిశ్రమ రాష్ట్రానికి తరలిరావలనే ప్రకటనపై డా.కంచర్ల అచ్యుతరావు హర్షం


(విశాఖపట్నం-మీడియావిజన్ ఏపీటిఎస్ అక్టోబర్ 25 )
తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సినీ పరిశ్రమ రావడం, ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోని సినిమాల నిర్మాణాలు జరగడం వలన రాష్ట్రంలోని కళాకారులకు, సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు ఉపాది అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. ఇటీవలే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తనకి హామీ ఇచ్చిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యటక శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల పేర్లను యధావిధిగా సినిమాల్లో చూపించడం ద్వారా మంచి ప్రచారం జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించడం కూడా శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రమోషన్ చేయడానికి తమ సినిమాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తామని కూడా కంచర్ల ఈ సందర్భంగా మీడియా ద్వారా స్పష్టం చేశారు. రాష్ట్రానికి సినీ పరిశ్రమ రావడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం వుంటుందన్నారు. తద్వారా రాష్ట్రంలోని సినీ నిర్మాతలు సినిమాలు నిర్మించుకోవడానికి మరో రాష్ట్రానికి వెళ్లే ఇబ్బందులు కూడా తప్పుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖజిల్లాలోని చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. అన్నింటిని ప్రత్యేక కోణంలో తమ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపడతామని స్పష్టం చేశారు. మంచి వాతారణంలో రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావాలని ఆయన ప్రకటన చేయడంతోపాటు, దానికి సంబంధించిన ఇతరత్రా కార్యాలయ తరలింపు విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకి మంచిరోజులు వస్తాయనే నమ్మకం మంత్రి ప్రకటనతో మరింత బలం చేకూరిందని కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.

Related Articles

Back to top button