దక్షిణ వైసిపి శ్రేణులకు, ప్రజలకు అండగా వాసుపల్లి….. ఓడినా కూడా ఆగని ఆర్ధిక సాయం…. బాధితుడికి రూ.5 వేలు ఆర్థిక సాయం….. ప్రశంసలు పొందుతున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్.
విశాఖపట్నం జులై 30(మీడియా విజన్ ఏపీటీఎస్ ప్రతినిధి )
విశాఖ దక్షిణ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్న 38వ వార్డు చెందిన చిన్ని కృష్ణకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆయన 38 వార్డులో నివాసం ఉన్న చిన్నికృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించి మా కుటుంబానికి అండగా భరోసా కల్పించారు. అతని కుటుంబ జీవన నేపథ్యం తెలుసుకొని అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు స్వయంగా తెలుసుకుని చిన్ని కృష్ణకు వాసుపల్లి గణేష్ కుమార్ 5000 రూపాయలు తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో అవసరమైతే ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలు, పేదల పక్షంలో నిలబడి పోరాటాలు చేసి ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ ఆదుకుంటుందని తెలిపారు. తాను అధికారంలో ఉన్న లేకున్నా ఎల్లప్పుడూ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలను ఆదుకుంటూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.