Blog

మాలధారణ స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం.. ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు

విశాఖపట్నం డిసెంబర్ 8 : ( మీడియావిజన్ ఏపీటీఎస్ ) సిటీ డస్క్


అయ్యప్ప , భవాని దీక్ష తీసుకున్న స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని ఉపకార్ ట్రస్ట్ అధినేత, వ్యాపారవేత్త డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఆరిలోవ సూర్య తేజ నగర్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన అంబలం పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అయ్యప్ప ,భవాని స్వాములకు చేస్తున్న సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తాను ఉన్నానంటూ అండగా నిలిచే వ్యక్తి కంచర్ల అచ్యుతరావు అని ప్రశంసించారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావుని ఘనంగా సత్కరించారు.

Related Articles

Back to top button