Blog

రాష్ర్టంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం…ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సమావేశంలో గంట్ల శ్రీనుబాబు

తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతాం…జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ నాయకులు గంట్ల శ్రీనుబాబు

సీతంపేట, ఆగస్టు 1..
రాష్ర్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ నాయకులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం విశాఖ పౌరగ్రంథాలయంలో నిర్వహించిన ఏపిబ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడారు. 2014నుంచి 2019 నడుమ జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లు కేటాయించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు మూడుసెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే నేటికి కూడా జర్నలిస్టుల ఇళ్ల కల సాకారం కాలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను రాష్ర్ట కార్యవర్గంతో కలుసుకొని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా జర్నలిస్టులకు ఒకే పాలసీని ప్రభుత్వం అమలు చేస్తుందని ఇప్పటికే ఆ విషయాన్ని తమ రాష్ర్ట కార్యవర్గానికి ప్రభుత్వ పెద్దలు తెలియజేశారన్నారు. అలాగే అన్ని కమిటీల్లోనూ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కు తమ సహకారం నిరంతరం అందిస్తామన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్, అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ దశాబ్ధాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని కాబట్టి ఆదిశగానే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇక జర్నలిస్టుల సంక్షేమానికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏపి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్ తదితరులు మాట్లాడుతూ ఎలక్ర్టానిక్ మీడియాలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు తమ పరిధి మేరకు అందుబాటులో ఉంటూ సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. తమ కార్యవర్గం నిరంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతుందన్నారు.
సమావేశంలో బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పి.నర్సింగరావు, నాయుడు, కె.బాబూరావు, మళ్ల దేవత్రినాధ్, నాయుడు, ఏ.సురేష్, ఏ.శేషు, జిఆర్ ఎస్ రమేష్, ఎన్.నెలరాజు, శివ దిలీఫ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button