రైటర్స్ అకాడమి ఆధ్వర్యంలో ఈ నెల 22న విశాఖలో జరగనున్న ఉత్తరాంధ్ర జానపద జాతర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
విశాఖపట్నం ఆగస్టు 17 : (మీడియావిజన్ ఏపీటీఎస్ సాంసృతిక విభాగం )
ప్రపంచం జానపద దినోత్సవం సందర్భంగా ఆగష్టు 22 గురువారం విశాఖ లో భారీ ఎత్తున ఉత్తరాంధ్ర జానపద జాతర ను రైటర్స్ అకాడమీ నిర్వహిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి నగరం లోని అన్ని కళా సంస్థలూ భాగస్వామ్యం అవుతున్నాయని ఉత్తరాంధ్ర జానపద జాతర నిర్వాహక కమిటీ,రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వి . వి. రమణమూర్తి తెలిపారు,, ఈ సందర్బంగా లైబ్రరీ ఏర్పాటు చేసిన సమావేశం లో కార్యక్రమం వివరాలు వెల్లడించారు.. రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం ఉత్తరాంధ్ర కళాకారులకు ఆశీస్సులు అందించేందుకు విచ్చేస్తున్నారన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బీచ్ రోడ్డు లోని సీఎంఆర్ విశ్వ ప్రియా ఫంక్షన్ హాల్ నుంచి సుమారు మూడు వేల మంది కళాకారులు ర్యాలీగా బయలుదేరి సిరిపురం దగ్గరి గురజాడ కళాక్షేత్రం వద్దకు చేరుతారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉత్తరాంధ్ర జానపద కళా రీతుల ప్రదర్శనలు మొదలవుతాయి. ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర లోని మన్యం ప్రాంతం తో సహా అన్ని ప్రాంతాల నుంచీ కళాకారులు తమ తమ ప్రదర్శన లతో పాల్గొన బోతున్నారు. ఉత్తరాంధ్ర కళా రీతులైన చిన్న తాళం భజన, చెక్క భజన, పులివేశాలు, కర్ర సాము, కత్తి సాము, తూర్పు బాగోతం, సవర అగం దిమ్మేసా నృత్యం, ఆదివాసీ కోందు దిమ్మసా నృత్యం, పొడుగు కాళ్ళు, జాలరి నృత్యం, రైతు నృత్యం, జముకు ఇలా ఎన్నో ఉత్తరాంధ్ర జానపదాలతో పాటు ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక శాఖ సహకారంతో పిట్టల దొర, గరగ నృత్యం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రం, డంఖాలు ఈ కార్యక్రమం లో పాల్గొంటాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ 20 మంది మహిళా డప్పు కళాకారులను, 22 మంది ఒగ్గుడోలు నృత్య బృందాన్ని పంపుతోందని తెలిపేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమం లో కళాకారులను ఆశీర్వదించేందుకు ఏపీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హెూమ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, విజయనగరం ఎంపీ శ్రీ. కే. అప్పలనాయుడు, మాజీ మంత్రి శ్రీ దాడి వీరభద్రరావు, శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, శ్రీ గంటా శ్రీనివాసరావు, శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు, శ్రీ గణబాబు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు,శ్రీ విష్ణుకుమార్ రాజు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ విచ్చేయు చున్నారు.ఉత్తరాంధ్ర జానపద కళలను ప్రపంచానికి మరింత దగ్గర చేసేందుకు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించి ప్రోత్సహించాలసిందిగా కోరుకుంటున్నమన్నారు . .