Blog
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత…… రాష్ర్టరవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…. రోడ్డు సేఫ్టీ అవగాహన పై పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి…
విజయవాడ, ఆగస్టు,11. మీడియావిజన్ ఏపీటీఎస్
విజయవాడ, క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ వారి రోడ్డు భద్రతా పోస్టర్లను రవాణా శాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అనేవి అత్యంత విషాదమైన సంఘటనలని, దీని నివారించుటకు ప్రజలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. రోడ్డు భద్రత పోస్టర్ల ద్వారా మద్యం సేవించి వాహనాలు నడపరాదని,హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి జాతీయ రహదారుల్లో లైన్ డిస్ప్లెయిన్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే దుర్గ పద్మజ, సభ్యులు వెంకటేశ్వరరావు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.