వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జర్నలిస్ట్ డే వేడుకలు….. సీనియర్ క్రైం రిపోర్టర్, జీటీపీఎల్ బ్యూరో చీఫ్ ఎం. ఎస్.ఆర్. ప్రసాద్ ని సత్కరించిన వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్
విశాఖపట్నం, సెప్టెంబర్ 8 :(మీడియావిజన్ ఏపీటీఎస్ )
ప్రింట్అం డ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటో వీడియో జర్నలిస్టులకు గౌరవ సత్కారం
ముఖ్య అతిథిగా వాసవియన్ డాక్టర్ కందుల నాగరాజు, ప్రతినిధులు పాల్గొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్స్ సమాజాభివృద్ధి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్డగళ్ళ వివి గుప్తా అధ్యక్షులు పి వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఎస్ రఘురాం కోశాధికారి కే రామకృష్ణ ‘చైర్మన్ కపుల్ వాసవి వీక్’ జి.నారాయణమూర్తి రమణిపూర్వ అధ్యక్ష కార్యదర్శులు ఇతర ప్రతినిధులు సభ్యులు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.గౌరవ సత్కారాన్ని అందుకున్న వారిలో సీనియర్ క్రైం రిపోర్టర్, జిటిపిఎల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎమ్మెస్సార్ ప్రసాద్ , నేమాల హేమ సుందరరావు(గ్రేటర్ టుడే ),ఇరోతి ఈశ్వరరావు(మెట్రో టీవీ ), కిల్లి ప్రకాశరావు(విశాఖ సమాచారం ), మహేష్(విశాఖటుడే ),అరుణ( డక్కన్ క్రానికల్ ), మీనాక్షి (ఏసీటీ), మాధవి(వార్త ),జ్యోతి(వాజి),ఎన్.రామకృష్ణ(స్కై లైన్),ఎల్.ఎన్ నాయుడు(విశ్వభారత్ ),మదన్(24×7 మీడియా ),వంకాయల ప్రభాకర్(సిటీ కేబుల్ ),చెరుకు శ్రీనివాస్(ఎస్డీవి ),శివ దిలీప్(జిటిపిఎల్ ),ఎస్.రామకృష్ణ(బీఆర్కే ), జగన్ మోహన్(విశ్వచిత్రకళ ),టివిఎన్ ప్రసాద్(స్మార్ట్ సిటీ న్యూస్ ), పి.నగేష్(ఆంధ్రప్రభ ), బి.ఆనంద్(సిటీ కేబుల్) , ఎస్. వేణుగోపాలరావు (అక్షర కిరణం ),సిoగుపురపు యుగంధర్(తెలుగు విజన్ టీవీ ),రాఘవ(విశ్వభారత్ )ఇతర పాత్రికేయులు ఫోటో వీడియో జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు ఉన్నారు.