విక్టరీ ఎట్ సి మెమోరియల్ స్థూపం పై లేజర్ షో ప్రదర్శన అద్భుతం…… విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీ భరత్
విశాఖపట్నం, సెప్టెంబర్ 2:
(మీడియావిజన్ ఏపీటీఎస్ ప్రత్యేక ప్రతినిధి )
-విశాఖపట్నం ,సెప్టెంబర్ 2: విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎట్ సి మెమోరియల్ స్తూపం పై ఈస్టరన్ నావెల్ కమాండ్ యొక్క వీరోచిత యుద్ధ విజయాలకు సంబంధించి అద్భుతమైన లేజర్ షోను ఈస్ట్రన్ నేవెల్ కమాండ్, జీవీఎంసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం .శ్రీ భరత్ సోమవారం పేర్కొన్నారు.
భారత నౌకాదళ చీఫ్ నేవల్ కమాండర్ రాజేష్ పెండార్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.హరేంధిర ప్రసాద్, జివీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ తూర్పు నౌకాదళ అద్భుత విజయాల పరంపరను ప్రదర్శన రూపంలో ఈ లేజర్ షో ద్వారా విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎట్ సి మెమోరియల్ స్థూపంపై ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు జీవీఎంసీ సంయుక్తంగా ప్రతివారం ప్రదర్శించేందుకు ప్రణాళికలు చేపట్టడం జరిగినదని, ఇటువంటి చరిత్ర కలిగిన అద్భుత విజయాలను విశాఖ నగర ప్రజలు, విహారయాత్రికలకు ,లేజర్ షో ద్వారా ఇంగ్లీషు, తెలుగులో కూడా త్వరలో ప్రతివారం ప్రదర్శించబడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, శాసనమండలి సభ్యులు వరుదు కళ్యాణి, విశాఖ పోలీస్ కమిషనర్ ఎస్. భాగ్చి, నేవెల్ అధికారులు ,జీవీఎంసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,
జివిఎంసి