Blog

విజయవంతంగా ముగిసిన సౌత్ జోన్ ఫిజీషియన్ల సదస్సు-వైద్య రంగంలో వచ్చిన మార్పులు పై 67 మంది నిపుణులు ప్రసంగం-ఆంధ్ర ప్రదేశ్ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ కే రాంబాబు

విశాఖపట్నం: సెప్టెంబర్ 22, ( మీడియావిజన్ ఏపీటిఎస్ )


మూడు రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరిన వేదికగా నిర్వహించిన సౌత్ జోన్ & సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ వార్షిక సదస్సు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఫిజిషియన్ల సంఘ అధ్యక్షులు & విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) డైరెక్టర్ డాక్టర్ కే.రాంబాబు మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని పలు రాష్ట్రాల నుండి 1200 మంది ఫిజీషియన్స్ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారని ఆయన అన్నారు. దేశంలోని 67 మంది వైద్య నిపుణులు ఈ సదస్సు లో ప్రసంగించారన్నారు. ప్రభుత్వ వైద్యులు రక్షణ అంశాల్లో ప్రసంగించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ వైద్య పరిరక్షణ కమిటీ సభ్యులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి తో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ శాకిర్ హుస్సేన్, సతీష్ చంద్ర లు తమ వారి పరిశోధనలు, అనుభవాలు, సూచనలను రానున్న తరం నూతన వైద్యులతో పంచుకున్నారని, ఈ సమావేశాల్లో లండన్ కు చెందిన నిక్ స్మాల్ వుడ్ అనే వైద్యుడు లైవ్ స్క్రీన్ ద్వారా ప్రసంగించారని ఆయన తెలిపారు. మొత్తం మూడు వేదికలుగా జరిగిన ఈ సమావేశాల లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వైద్యులు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ సదస్సులో డెంగ్యూ, మలేరియా, గుండె నొప్పి ముందు ఎలా గుర్తించాలి ,ప్రమాద కర స్థితి లో రోగి వస్తె ఏ విధంగా వైద్య సేవలు ఇవ్వాలో సదస్సు లో నిపుణులు వివరించారు. ఈ సదస్సు లో జరిగిన ప్రధాన అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయనున్నామని తెలిపారు. ఈ సదస్సులో ప్రధానం గా వైద్య పరీక్షలకు మల్టీ పర్పస్ కిట్ లు ద్వారా జ్వరం నుంచి గుండె నొప్పి వరకు అనేక వైద్య సేవలకు ఉపయోగపడుతుందని, అనేక టెస్ట్ ల అవసరం లేకుండా ఒక్క టెస్ట్ కిట్ తోనే అనేక వైద్య ఇబ్బందులు తొలగిపోతాయని ఈ విధంగా నూతన వైద్యులు ముందుకు వెళ్ళాలని పలువురు ప్రముఖులు సూచించారు అన్నారు. నూతన టెక్నాలజీ అంది పుచ్చుకోవటం , టేలిమెడిసిన్, డిజిటల్ ల్యాబ్ రిపోర్ట్ లు టేలిమెడిసిన్, డిజిటల్ ల్యాబ్ రిపోర్ట్ లు బద్రపరచడం.. సి ఎం ఎస్ కంటిన్యూ మెడిసిన్ సిస్టమ్, వైద్య వ్యవస్థ మార్పు కు వైద్యులు అడుగులు వేయాలని ,ఇతర వైద్య నిపుణులతో వైద్య నిపుణులు సంప్రదింపులు జరపాలన్నారు. తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునని సూచించామని అన్నారు. అంతేకాకుండా కొవిడ్ ఇతర వైరస్ లు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చెయ్యడానికి వైద్యులు సిద్ధంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు…

Related Articles

Back to top button