Blog

విశాఖ మాధవధార శ్రీ మాధవ స్వామి ఆలయంలో భారీ చోరీ…

విశాఖపట్నం ఆగస్టు 13 : (మీడియావిజన్ ఏపీటీఎస్, స్టేట్ బ్యూరో )

మాధవధార శ్రీ మాధవ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఆలయ అర్చకులు వరాహ నరసింహస్వామి మంగళవారం ఉదయం ఆలయం ఆలయ తలుపులు తీయడానికి ప్రయత్నించే లోపే ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. స్వామివారి విగ్రహాలకు ఉండవలసిన ఉండవలసిన బంగారం, వెండి ఆభరణాలు లేకపోవడం చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించి, కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం ఆలయానికి చేరుకొని దొంగతనం జరిగిందని నిర్ధారించారు. ఆలయ అర్చకులు లెక్క ప్రకారం బంగారం వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి సుమారు 10 లక్షలు వరకు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. దేవుడు ఆలయానికే రక్షణ లేదని స్థానికులు వాపోయారు.

Related Articles

Back to top button