విశాఖపట్నం, సెప్టెంబర్ 12 : ( మీడియావిజన్ ఏపీటీఎస్ )
ఈ నెల 17 న జరగనున్న విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పండగగా అధికారికంగా నిర్వహించాలని విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోరింది చేసింది.ఈ సందర్బంగా గురువారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ ను జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి గత సంవత్సరం అధికారిక పండగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఇచ్చిన జీవో కాపీ తో పాటు వినతి పత్రం సమర్పించారు.అనంతరం విశాఖపట్నం బీసీ వెల్ఫేర్ ఈడి ని కలిసి వినతిపత్రం,జీఓ కాపీ అందచేశారు. చివరిగా తెలుగుదేశం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బిసి సాధికార సమితి కన్వీనర్ గోడి నరసింహ చారి ని కలిసి విశ్వకర్మ జయంతి వేడుకలు ప్రభుత్వపరంగా నిర్వహించేలా కృషిచేయాలని వినతిపత్రం అందచేసారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శివకోటి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి గిడిజాల పార్వతీశం,వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కి కొండబాబు, కోశాధికారి ఎమ్ చంటిబాబు,జాయింట్ సెక్రటరీలు గుత్తికొండ గంగాధరం,బంగారు సురేష్,వీరాచారి,గోలి సతీష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.