విశాఖపట్నం :ఆగస్టు 14 ( మీడియావిజన్ ఏపీటీఎస్ )
విశాఖ సిటీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా కోర్టులో అన్ని లా కళాశాలల న్యాయ విభాగ విద్యార్దులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఎన్.బి. ఎం లా కాలేజీ విద్యార్థిని చెన్నా ప్రణాళికకు ప్రథమ బహుమతి లభించింది. ఈ కార్యక్రమం విశాఖ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెవర సత్యనారాయణ, విశాఖ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. నరేష్ కుమార్, సీనియర్ అడ్వకేట్ పి.వి. ఎస్.ఏ. రవీంద్రనాథ్ ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లా కళాశాలల విద్యార్థుల్లో చట్టాలందు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను నిర్వహించామన్నారు. అనంతరం పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన చెన్న ప్రణాళికకు సర్టిఫికేట్, బహుమతిని అందించి అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, వివిధ న్యాయ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.