ప్రముఖ సినీ హీరో విక్రమ్ కు అప్పన్న జ్ఞాపికతో సత్కరించిన గంట్ల
విశాఖపట్నం ఆగష్టు 13 : మీడియావిజన్ ఏపీటీఎస్
ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహ స్వామి అత్యంత మహిమాన్వితులని, అటువంటి స్వామి జ్ఞాపికను తనకు అందచేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందని ప్రముఖ సినీ హీరో విక్రమ్ అన్నారు.. తంగళాన్ సినిమా ప్రమోషన్ కోసం మంగళవారం విశాఖ వచ్చిన హీరో విక్రమ్,హీరోయిన్ మాళవికళలను సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకుని వారికి సింహాద్రి నాధుడు జ్ఞాపిక బహుకరించారు. ఈ సందర్భంగా పురాతనమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన సింహాద్రినాధుడు ఆలయ విశిష్టతను విక్రమ్ కు శ్రీను బాబు వివరించారు… ఆ వరాహ నారసింహ స్వామి ఆశీస్సులతో తమ సినిమా పూర్తిగా విజయవంతము కావాలని ఇందుకు అన్ని బాషల అభిమానులు తో పాటు తనను అత్యధికముగా అభిమానించే తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నట్లు విక్రమ్ ఆకాక్షించారు…