విశాఖపట్నం :(మీడియావిజన్ ఏపీటీఎస్ న్యూస్)
జర్నలిస్టుల సంక్షేమం తో పాటు వారికి కావలసిన ఉద్యోగ భద్రత, వ్యక్తిగత భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పాటుపడుతుందని. APUWJ విశాఖజిల్లా కోశాధికారి కిల్లి ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో APUWJ ఆధ్వర్యాన సోమవారంవిశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం (
జిల్లా మహాసభ) జరిగింది, సమావేశ అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ తో పాటు అనుబంధ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం కూడా ఎన్నుకోబడింది.నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కొశాధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన కిల్లి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు.యూనియన్ లో అనేక సంవత్సరాలుగా సేవలందించడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు.
జర్నలిస్ట్ ల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కొనసాగుతున్న యూనియన్ తమదే అన్నారు. జర్నలిస్టుల హక్కులు, జర్నలిస్టుల ఉద్యోగ, వ్యక్తిగత భద్రత విషయంపై జర్నలిస్టులను ఐక్యం చేస్తూ తాము ముందుకు సాగుతున్నామన్నారు. అంతేకాక జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి కావలసిన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వం పై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులు తమ హక్కులను సాదించుకోవాలంటే ఐక్యతతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.అనంతరం యూనియన్ ప్రతినిధులు కిల్లి. ప్రకాష్ రావు ను ఘనంగా సత్కరించి అభినందించారు.