ఛత్తీస్గఢ్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసుపై రీ ఎంక్వైరీ కి ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆదేశం…..
.
అమరావతి ఆగస్టు 20:మీడియావిజన్ ఏపీటీఎస్
ఛత్తీస్గఢ్ కు చెందిన ఆరుగు జర్నలిస్టులపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు పై రీ ఎంక్వైరీ కి lఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.మంగళవారం సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ( APUWJ ) నేతలు హోమ్ మినిస్టర్ ను కలిశారు. ఆ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు కేసు పూర్వ పరాలను వివరించారు. ఈ కేసు పై ఛత్తీస్ ఘడ్ పోలీస్ అధికారులు స్పందించి కొండ సబ్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుపోయారు. జర్నలిస్టుల పై అక్రమ కేసు నమోదులో చింతూరు ci పాత్ర ఉందని వెంటనే వెరిఫై చేసి కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే స్పందించిన హోంమంత్రి.. అల్లూరి సీతారామ జిల్లా ఎస్పీతో మాట్లాడి ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ. అలాగే ఈ ఘటనపై రీ ఎంక్వయిరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఎస్పీ కి ఆదేశాల ఇచ్చారని నాయకులు తెలిపారు. .. అలాగే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని యూనియన్ నేతలు కోరారు. అనేక కేసులను వివరించారు. జర్నలిస్ట్ లపై దాడులు చేసిన కేసులను పునర్విచారణ చేసి దోషుల పై చర్యలు తీసుకోనే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని సూచించారు. తప్పకుండా న్యాయం చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ.వి. సుబ్బారావు తో పాటు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, యూనియన్ రాష్ట్ర నాయకులు కృష్ణ మోహన్, సచివాలయ జర్నలిస్టులు సత్యనారాయణ, రామకృష్ణ, ప్రసన్నకుమార్, విజయ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.