ఎంవీపీ కాలనీ ఆగస్టు 24: మీడియావిజన్ ఏపీటీఎస్
నావెల్ డాక్ యార్డ్ షాప్ కమిటీ ఎన్నికల్లో. విజయం సాధించిన 15
మంది కేటీబి అసోసియేషన్ సభ్యులను మాజీ మంత్రి,, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభినందించారు. శనివారం ఆయన నివాసంలో. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు
బత్తుల చిరంజీవిల నేతృత్వంలో. విజయం సాధించిన ఉద్యోగులను తొలుత వీరు గంటాకు పరిచయం చేశారు. అనంతరం విజేతలు అందరికీ గంటా కండువాలు వేసి అందరినీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ. డాక్ యార్డ్
కే టి బి అసోసియేషన్ ఎంతో మందికి ఆదర్శం గా నిలిచింది అన్నారు. ప్రభుత్వాలు పై ఆధారపడకుండా సొంతం గా సంఘం అతి పెద్ద భవనము నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. డాక్ యార్డ్ ఉద్యోగులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి తమ పరిధి మేరకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఐక్యంగా మరిన్ని విజయాలు సాధించాలని గంటా ఆకాంక్షించారు. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవిలు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 15 మంది విజయం సాధించడం ఎంతో ప్రశంసనీయమన్నారు.ఇందుకు ఉద్యోగులంతా ఐకమత్యంగా ముందుకు సాగడమే ప్రధాన కారణం అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసిమెలిసి అందరూ కూడా మరిన్ని విజయాలు సాధించాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో 15 మంది విజేతలతో పాటు యూనియన్ కు చెందిన రామచంద్రరావు, చిన్నారావు శ్రీధర్, శ్రీనివాస్, కంచిపాటి వెంకటేశ్వరావు, నాయుడు. తదితరులు పాల్గొన్నారు…