హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, కంచర్ల అచ్యుతరావు
విశాఖపట్నం : సెప్టెంబర్ 22 : ( మీడియావిజన్ ఏపీటిఎస్ )
చినగదిలి రాధాకృష్ణ నగర్లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. 24 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి 24 రోజులు ఉత్సవాలు చేయడం విశేషం. ఈ సందర్బంగా నిర్వహించిన లోకల్ టాలెంట్ ప్రతిభా పురష్కారాలు-2024 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ కొంత మంది వికృత చేష్టలకు పాల్పడుతూ విగ్రహలు ఏర్పాటు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. హనుమాన్ యూత్ సాంప్రదాయబద్దంగా ఉత్సవాలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ యూత్ కు ఎల్లవేళలా తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయిని స్పష్టం చేశారు లోకల్ టాలెంట్ ప్రతిభా పురష్కారాలులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరం లో 10th & ఇంటర్మీడియట్ లలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ప్రతిభా పురష్కారాలు అందచేశారు. స్థానిక కళాకారులు , క్రీడా, విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన వారికి జ్ఞాపికలు అందచేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించి కూచిపూడి క్లాసికల్ కాంపిటేషన్ విజేతలకు బహుమతులు అందించి, టీచర్స్ కి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపకార్ చార్టీబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, హనుమాన్ యూత్ సభ్యులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు