చేనేత కళాకారులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సాహించాలి…………VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పిలుపు
డిశంబర్ 16, విశాఖపట్నం (మీడియావిజన్ ఏపీటీఎస్)
మన సంసృతి,సాంప్రదాయాలను ప్రతిబింభించే చేనేత వస్త్రాలను అందరిస్తూ,హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి సాగించే చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సాహించాలని VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. పోలమాంబ అమ్మవారి ఆలయం ప్రక్క ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఈ నెల 10 నుంచి జనవరి 31 వరకు కొనసాగనున్న శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ను సోమవారం సాయంత్రం వి ఎం అర్ డి ఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సందర్శించారు.ఈ సందర్బంగా అయన కొన్ని స్టాల్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శన లో స్టాల్స్ ను సందర్శించి, కళా రూపాలను తిలకించారు. హస్త కళాకారులకు అభినందనలు తెలిపారు. ఇన్ని రకాల వస్త్రాలు ఒకే చోట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన, అమ్మకాలను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.క్రిస్టమస్, సంక్రాంతి పండగల సీజన్లో ఇటువంటి ప్రదర్శన, అమ్మకాలు నగర వాసులకు అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులను అభినందించక తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బండారు లోకేష్,కుంభంపాటి పద్మావతి,సుజాత,చిన్ని,సుమలత,స్వర్ణ,మేరీ డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.